ఏంటి శ్రీముఖి నువ్వింకా ఇండస్ట్రీలో ఉన్నావా..గ్లామర్ బాగా పెంచావ్
on Dec 3, 2023
కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ ఫస్ట్ సీజన్ ఆడియన్స్ ని అలరించి అలా వెళ్ళిపోయింది. ఈ ఫస్ట్ సీజన్ కి సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి యాంకర్లుగా వ్యవహరించగా, ఈ సీజన్‌కి శ్రీముఖి హోస్ట్‌గా వచ్చేసింది. ఇక ఇప్పటినుంచి సీజన్ 2 ఎంటర్టైన్ చేయబోతోంది. ఇందులో ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. యాదమ్మ రాజు, ఎక్స్ప్రెస్ హరి, సద్దాం, భాస్కర్-జ్ఞానేశ్వర్, ముక్కు అవినాష్ ఈ ఎపిసోడ్ లో ఎంటర్టైన్ చేశారు. ఇక అనిల్ రావిపూడి మంచి సాంగ్స్ కి డాన్స్ వేస్తూ స్టేజి మీదకు వచ్చారు. ఇక ఎక్స్ట్రా కలర్ గా గుంటూరు కారం రౌడీ రోహిణిని ఇన్వైట్ చేశారు.
ఈ షోలో అనిల్ రావిపూడి రెండు గుడ్ న్యూస్ చెప్పారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ సీజన్ 1 కి టాలెంట్ ట్రాక్ అనే అవార్డు వచ్చింది. ది బెస్ట్ డిజిటల్ షో ఇన్ కామెడీ...అలాగే ఈ షో ఆసియన్ టీవీ అవార్డ్స్ కి ఆసియా లెవెల్లో నామినేట్ అయ్యింది అంటూ చెప్పారు. లాస్ట్ సీజన్ లో ఇన్వెస్టర్స్ గా ఉన్న ఆడియెన్స్ స్టాక్స్ గా కమెడియన్స్ కి మార్క్స్ ఇచ్చారు..ఐతే ఈ సీజన్ లో ఇంకో చిన్న మార్పు కూడా చేశారు. ఎవరైనా స్కిట్ చెడగొడితే వాళ్లకు మార్క్స్ తగ్గించేసేలా ఒక రూల్ ని తీసుకొచ్చారు. స్కిట్ బాగుంది అని ఎక్కువ ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్లకు కూడా స్పెషల్ సర్ప్రైజ్ ఉందన్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ ఎపిసోడ్ లో ఎక్స్ ప్రెస్ హరి శ్రీముఖి గురించి కామెంట్స్ చేసాడు. "ఏంటి శ్రీముఖి నువ్వింకా ఇండస్ట్రీలో ఉన్నావా...ఈపాటికి పెళ్ళైపోయి సంకలో పిల్లలని ఎత్తుకుని వాళ్ళ ముక్కులు తుడుస్తూ ఎక్కడో ఒక మూల ఉంటావని అనుకున్నా " అనేసరికి చెంప మీద ఒక్కటిచ్చి "చూసి మాట్లాడు" అంది.."కొంచెం గ్లామర్ పెంచావ్ కానీ అంత కాదు" అంటూ సెటైర్ వేసాడు. ఇలా ఈ వారం ఎపిసోడ్ ఎంటర్టైన్ చేసింది. ఇక కామెడీ ఇండెక్స్ లో ఫన్నీయెస్ట్ స్టాక్ ఆఫ్ ది డేగా యాదమ్మ రాజు నిలిచాడు.
Also Read